KTR: అధికారంలో ఉన్నవారి కంటే ప్రజలే శక్తిమంతులు.. సాగు చట్టాల రద్దుపై కేటీఆర్​

KTR Response On Repealing Farm Laws
  • కావాల్సింది సాధించి రైతులంటే ఏంటో నిరూపించారు
  • జై కిసాన్.. జై జవాన్ అంటూ ట్వీట్
  • ఇవాళ సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్రం
సాగు చట్టాల రద్దుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇవాళ ఉదయం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ ఆ నిర్ణయాన్ని స్వాగతించాయి. తాజాగా కేటీఆర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘‘అధికారంలో ఉన్న వారి శక్తికన్నా.. వారిని అధికారంలో కూర్చోబెట్టిన ప్రజల శక్తి మరింత శక్తిమంతమైనది’’ అంటూ ట్వీట్ చేశారు. అలుపులేని పోరాటంతో తమకు కావాల్సిన దానిని సాధించుకుని.. భారత రైతులంటే ఏంటో నిరూపించారని కామెంట్ చేశారు. జై కిసాన్.. జై జవాన్ అంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎప్పుడూ రైతుల వెంటే ఉంటుందన్నారు.
KTR
Farm Laws
TRS
Telangana

More Telugu News