వ్యవసాయ చట్టాల రద్దుపై చంద్రబాబు స్పందన

19-11-2021 Fri 12:01
  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
  • రైతుల ఆందోళనను కేంద్రం అర్థం చేసుకుంది
  • మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి
Chandrababu response on 3 farm laws
అత్యంత వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు. మరోవైపు దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రైతు చట్టాలను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రైతుల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుందని... ఇది శుభపరిణామమని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టే... మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.