Andhra Pradesh: పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం

  • తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో తీరం దాటిన వాయుగుండం
  • చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం
  • అప్రమత్తంగా ఉండాలన్న ఏపీ విపత్తుల నిర్వాహణ శాఖ కమిషనర్
Depression  Crossed between Chennai and Puducherry Coast this Morning

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ తెల్లవారుజామున 3-4 సమయంలో పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.

మరోవైపు, వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. జలాశయాలు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

More Telugu News