పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం
- తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో తీరం దాటిన వాయుగుండం
- చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం
- అప్రమత్తంగా ఉండాలన్న ఏపీ విపత్తుల నిర్వాహణ శాఖ కమిషనర్
మరోవైపు, వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. జలాశయాలు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.