నానీకి కొత్త టెన్షన్ తప్పేలా లేదే!

18-11-2021 Thu 18:31
  • డిసెంబర్ 24వ తేదీన 'శ్యామ్ సింగ రాయ్'
  • అదే రోజును ఫిక్స్ చేసుకున్న 'గని'
  • 'బింబిసార'కు ఆ తేదీ నచ్చిందట
  •  ఆ డేట్ వైపు దృష్టి పెట్టిన 'పుష్ప'?  
Shyam Singha Roy movie update
'శ్యామ్ సింగ రాయ్'తో నాని తన కెరియర్లోనే ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాడు. టైటిల్ .. లుక్ .. ముగ్గురు నాయికలు .. చారిత్రక నేపథ్యం పరంగా ఆయన కొత్తదనాన్ని ఆవిష్కరించనున్నాడు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఆయన ఈ సినిమా చేశాడు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు తీసుకుని రానున్నారు.

అదే రోజున వరుణ్ తేజ్ 'గని' కూడా రిలీజ్ అవుతున్నట్టు చెప్పారు. దాంతో నాని వెనక్కి తగ్గుతాడని అనుకున్నారు. కానీ ఈ రోజు టీజర్ ఈవెంట్లో 'క్రిస్మస్' మనదే అని ఆయన చాలా బలంగా .. దృఢంగా చెప్పాడు. అయితే కల్యాణ్ రామ్ 'బింబిసార' కూడా అదే రోజును సెట్ చేసుకుంటున్నాడనే టాక్ నెమ్మదిగా బయల్దేరింది.

కల్యాణ్ రామ్ ఇమేజ్ వేరు .. నాని క్రేజ్ వేరు. ఆ సినిమా జోనర్ వేరు .. ఈ సినిమా జోనర్ వేరు. అందువలన ఆ సినిమా అంతగా ప్రభావం చూపించకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కొన్ని కారణాల వలన 'పుష్ప' కూడా ఈ డేట్  ను ఆక్రమించే అవకాశం లేకపోలేదని చెప్పుకుంటున్నారు. చూస్తుంటే నానీకి కొత్త టెన్షన్ తప్పేలా లేనట్టుంది.