నాగ్ సినిమాను వదులుకున్న అమలా పాల్!

18-11-2021 Thu 17:48
  • నాగ్ హీరోగా 'ది ఘోస్ట్'
  • దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు 
  • ఛాన్స్ వదులుకున్న కాజల్ 
  • మరో కథానాయిక కోసం వెతుకులాట
The Ghost movie update
అమలా పాల్ కథానాయికగా చాలా తక్కువ గ్యాపులోనే మలయాళ .. తమిళ .. తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి నుంచి కూడా ఆమె తమిళ .. మలయాళ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళ్లింది. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే. వాటిలో 'నాయక్' .. 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలు ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టాయి.

కొత్త కథానాయికల పోటీ కారణంగా ఇప్పుడు ఆమెకి అంతగా అవకాశాలు లేవు. అయినా ఆమె నాగార్జున సరసన నాయిక పాత్రను వదులుకుందని అంటున్నారు. నాగ్ హీరోగా ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను అనుకుంటే, కొన్ని కారణాల వలన ఆమె చేయలేనని చెప్పింది.

దాంతో మరో కథానాయిక కోసం వెతుకుతూ అమలా పాల్ ను అడిగితే, పారితోషికం ఎక్కువ డిమాండ్ చేసిందని చెబుతున్నారు. సీనియర్ హీరోల జోడీగా హీరోయిన్స్ దొరకని ఈ పరిస్థితుల్లో అమలా పాల్ ఒప్పుకుని ఉంటే, ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.