MS Dhoni: ధోనీ కొత్త నేస్తం ఇదిగో!

Sakshi Singh imtroduces Dhoni new pet honey
  • ధోనీ ఇంట కొత్త సభ్యురాలు
  • మకావు చిలుకను తెచ్చుకున్న ధోనీ
  • ధోనీ టీ తాగుతుండగా భుజంపై కూర్చున్న చిలుక
  • చాయ్ డేట్స్ అంటూ సాక్షి సింగ్ హ్యాష్ ట్యాగ్
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పాక కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు మెంటార్ గా వ్యవహరించాడు. అయితే ధోనీకి ఇప్పుడు బోలెడంత తీరిక లభిస్తోంది. దాంతో తనకిష్టమైన సేంద్రియ వ్యవసాయం, బైకులు, కార్లు, పెంపుడు జంతువులతో కాలక్షేపం చేస్తున్నాడు.

తాజాగా ధోనీ ఇంట కొత్త సభ్యురాలు వచ్చింది. దానికి సంబందించిన ఫొటోలను ధోనీ అర్ధాంగి సాక్షి సింగ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ కొత్త సభ్యురాలి పేరు హనీ. అదొక మకావు చిలుక. కంటికి ఇంపైన రంగుల్లో ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ మకావు చిలుక ధోనీ భుజంపై ఉండడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు. ధోనీ టీ తాగుతుండగా, అది భుజంపై నింపాదిగా కూర్చుకుంది.

దీనిపై సాక్షి సింగ్ స్పందిస్తూ "మహీ మరియు అతడి హనీ" అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు, ఆ ఫొటోకు "చాయ్ డేట్స్" అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది. ఈ కూల్ పిక్ ధోనీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
MS Dhoni
Macau Parrot
Honey
Pet
ChaiDates

More Telugu News