బాలీవుడ్ ఛాన్స్ పట్టేసిన రాశి ఖన్నా!

18-11-2021 Thu 17:13
  • స్పీడ్ పెంచుతున్న రాశి ఖన్నా
  • తెలుగులో రెండు సినిమాలు
  • తమిళంలోను బిజీనే
  • చేతిలో హిందీ వెబ్ సిరీస్ లు
Rasi Khanna diong Bollywood move
కొంతకాలం క్రితం వరకూ రాశి ఖన్నా నిదానంగా .. నింపాదిగా తన సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అందాన్ని వెతుక్కుంటూ అవకాశాలు అవే వస్తాయనే నమ్మకంతో వెయిట్ చేస్తూ కూర్చుంది. అవకాశాలను తామే వెతుక్కుంటూ వెళ్లాలనే విషయాన్ని రాశి ఖన్నా గ్రహించేసరికి ఆలస్యమైపోయింది. ఇక అప్పటి నుంచి అన్ని వైపులా ఒక లుక్కేస్తూ ముందుకు వెళుతోంది.

తెలుగులో చైతూ జోడీగా 'థ్యాంక్యూ' .. గోపీచంద్ సరసన నాయికగా 'పక్కా కమర్షియల్' చేస్తోంది. తమిళంలో ఆమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు చేస్తూనే ఆమె హిందీలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. మొత్తం మీద ఖాళీగా లేకుండా రాశి ఖన్నా తన కెరియర్ ను కొనసాగిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆమెకి 'యోధ' సినిమాలో ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కరణ్ జొహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించనున్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక నాయికగా దిశా పటాని చేయనుండగా, మరో నాయికగా రాశి ఖన్నాను తీసుకున్నారట. కాస్త ఆలస్యమైనా అనుకున్న దిశగానే రాశి ఖన్నా ముందుకు వెళుతుండటం గొప్ప విషయమే!