KCR: హైదరాబాదులో ముగిసిన కేసీఆర్ మహాధర్నా... గవర్నర్ ను కలిసిన టీఆర్ఎస్ నేతలు

  • ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ మహాధర్నా
  • కేటీఆర్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ కు తరలివెళ్లిన టీఆర్ఎస్ నేతలు
  • వినతిపత్రం సమర్పణ
  • ధాన్యం అంశాన్ని కేంద్రానికి నివేదించాలని విజ్ఞప్తి
KCR Maha Dharna concluded

తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన మహాధర్నా ముగిసింది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో కేసీఆర్ నేడు హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగడం తెలిసిందే. కాగా ఈ ధర్నా ముగిసిన అనంతరం టీఆర్ఎస్ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ కు తరలివెళ్లారు.

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి, ధాన్యం కొనుగోలుపై తమ డిమాండ్లతో కూడిన పత్రాన్ని వారు ఆమెకు అందజేశారు. రాష్ట్రంలో యాసంగి వరిసాగు, ధాన్యం సేకరణ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ నేతలు కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో మంత్రులు మహమూద్ అలీ, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు.

More Telugu News