CM Jagan: అసెంబ్లీ సమావేశాల విరామంలో గవర్నర్ కు ఫోన్ చేసి పరామర్శించిన సీఎం జగన్

CM Jagan talked to governor
  • గవర్నర్ దంపతులకు కరోనా
  • హైదరాబాదు తరలింపు
  • ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
  • ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం జగన్
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన అర్ధాంగి సుప్రవ హరిచందన్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. వారు ప్రస్తుతం హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో సీఎం జగన్ గవర్నర్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని ఆరోగ్యవంతులై రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

సీఎం జగన్ నిన్ననే గవర్నర్ ఆరోగ్యంపై ఏఐజీ వైద్యులతో మాట్లాడారు. గవర్నర్ దంపతులను సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు వైద్యులు సీఎం జగన్ కు తెలిపారు.
CM Jagan
Governor
Corona Virus
AIG Hospital
Hyderabad
Andhra Pradesh

More Telugu News