Taliban: మా నిధులు మాకివ్వండి.. లేకపోతే ప్రపంచదేశాలు ఇబ్బంది పడతాయి: తాలిబన్లు

  • ఆప్ఘన్ నిధులను స్తంభింపజేసిన అమెరికా
  • తమ దేశం నుంచి వలసలు పెరుగుతాయన్న తాలిబన్లు
  • తమ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
Talibans demands USA to release funds

తాలిబన్లు ఆప్ఘనిస్థాన్ ను చేజిక్కించుకున్న తర్వాత ఆ దేశానికి చెందిన నిధులను అమెరికా స్తంభింపజేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం నిధులు లేక అల్లాడిపోతోంది. విదేశాల నుంచి వచ్చే దిగుమతులు కూడా తగ్గిపోవడంతో... ఆప్ఘనిస్థాన్ లో ఆహార సమస్య కూడా పెరుగుతోంది. శీతాకాలంలో ఆహార సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు తాలిబన్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమకు రావాల్సిన 9 బిలియన్ డాలర్లను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. లేనిపక్షంలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలసలు పెరుగుతాయని... ఆ వలసలతో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. తమ సెంట్రల్ నిధులను, ఆస్తులను అమెరికా స్తంభింపజేయడం ఆశ్చర్యకరంగా ఉందని తాలిబన్ నేతలు అన్నారు. దోహా ఒప్పందానికి విరుద్ధంగా అమెరికా ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News