'బంగార్రాజు' నుంచి నాగలక్ష్మిగా కృతి శెట్టి లుక్!

18-11-2021 Thu 11:09
  • షూటింగు దశలో 'బంగార్రాజు'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • చైతూ జోడీగా కృతి శెట్టి
  • దర్శకుడిగా కల్యాణ్ కృష్ణ
Krithi Shetty first look released
నాగార్జున కథానాయకుడిగా గ్రామీణ నేపథ్యంలో 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, చైతూ .. కృతి జంటగా కనువిందు చేయనున్నారు. నాగ్ సొంత బ్యానర్లో ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది.

ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన స్వర్గానికి సంబంధించిన హుషారైన పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. లుక్ పరంగా నాగార్జున కూడా మంచి మార్కులు కొట్టేశారు. తాజాగా ఈ సినిమాలో కృతి శెట్టి పోషిస్తున్న నాగలక్ష్మి పాత్రను పరిచయం చేస్తూ ఆ పాత్రకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు.

గ్రామీణ ఎన్నికలలో నాగలక్ష్మి గెలిచి ఉంటుంది. అప్పుడు జరిపిన ఉరేగింపులో ఆమె జనాల వైపు చూస్తూ చేయి ఆడిస్తున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ఆమె చేతిలో ఖరీదైన స్పెట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ కలర్ ఫుల్ లుక్ లో కృతి శెట్టి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చూస్తుంటే 'బంగార్రాజు'లో నాగలక్ష్మి సందడి ఒక రేంజ్ లో ఉండనున్నట్టు అర్థమవుతోంది..