Errabelli: మోదీ నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి టీఆర్ఎస్ కార్యాచరణ ఉంటుంది: ఎర్రబెల్లి

KCR is fighting against Centre says Errabelli
  • రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోంది
  • బీజేపీ నేతలను ప్రజలు ఉరికిచ్చి కొడుతున్నారు
  • కేంద్రంపై కేసీఆర్ పోరాటం చేస్తున్నారు
రైతులకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కేంద్రం వైఖరి సరిగా లేకపోవడంతో రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాశారని... ఆ లేఖకు సమాధానం వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.

తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని... బీజేపీ నేతలను ప్రజలు ఉరికిచ్చి కొడుతున్నారని అన్నారు. రైతుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే మళ్లీమళ్లీ ఉరికిచ్చి కొడతారని చెప్పారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ భారీ ధర్నాకు దిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎర్రబెల్లి పైవ్యాఖ్యలు చేశారు.
Errabelli
TRS
KCR
Narendra Modi
BJP

More Telugu News