అక్షరం పట్టుకున్న ఆయుధమే 'శ్యామ్ సింగ రాయ్' .. టీజర్ రిలీజ్!

18-11-2021 Thu 10:48
  • నాని కథానాయకుడిగా 'శ్యామ్ సింగ రాయ్'
  • కలకత్తా నేపథ్యంలో సాగే కథ
  • విడుదల తేదీ డిసెంబర్ 24
  • నాలుగు భాషల్లో ఒకే రోజున విడుదల
Shyam Singha Teaser Released
నాని తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా చేశాడు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ సందడి చేయనున్నారు.

ఈ కథ కోల్ కతా నేపథ్యంలో నడుస్తుంది. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ  భాషల్లోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. కథా నేపథ్యంతో పాటు నాని .. సాయిపల్లవి .. కృతి శెట్టి పాత్రలను ఈ టీజర్ లో రివీల్ చేశారు.

"అడిగే అండలేదు .. కలబడే కండలేదని రక్షించవలసిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే, కాగితం కడుపు చీల్చుకు పుట్టి రాయడమే కాదు, కాలరాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే 'శ్యామ్ సింగ రాయ్' అంటూ ఆ పాత్ర మూలం చెప్పేశారు. ''స్త్రీ ఎవడికీ దాసీ కాదు ... ఆఖరికి ఆ దేవుడికి కూడా" అనే నాని డైలాగ్ తో, కథాంశం ఏమిటనేది అర్ధమయ్యేలా చేశారు. మొత్తం మీద ఈ టీజర్ .. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.