నయనతార అసలు ఆ మాటే అనలేదట!

18-11-2021 Thu 10:19
  • షూటింగు దశలో 'గాడ్ ఫాదర్'
  • దర్శకుడిగా మోహన్ రాజా
  • కీలకమైన పాత్రలో సత్యదేవ్
  • నయన్ విషయంలో రానున్న స్పష్టత
God Father movie upadate
చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. మలయాళంలో మోహన్ లాల్ కి మంచి పేరు తెచ్చిపెట్టిన 'లూసిఫర్'కి ఇది రీమేక్. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను సత్యదేవ్ పోషిస్తున్నాడు. ఆయన భార్య పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి.

తన భర్త రోల్ కి సత్యదేవ్ క్రేజ్ సరిపోదనీ, వేరెవరినైనా చూడమని నయనతార చెప్పినట్టుగా రెండు రోజులుగా ఒక వార్త షికారు చేసింది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదట. అసలు ఆ మాటనే నయన్ అనలేదనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. సాధారణంగా నయనతార కథ ... తన పాత్రను గురించి తప్ప ఇతర విషయాలను గురించిన ఆలోచన చేయదు.

ఒక వైపున సీనియర్ స్టార్ హీరోల సరసన చేస్తూనే, మరో వైపున కొత్త హీరోలతో జోడీకట్టడమన్నది ఆమె కెరియర్లో కనిస్తుంది. పైగా ఆమె ఏ ఆర్టిస్టును తక్కువ చేసి మాట్లాడిన దాఖలాలు ఇన్నేళ్ల ఆమె కెరియర్లో కనిపించవు. త్వరలోనే నయన్ - సత్యదేవ్ ల ఎంపికపై స్పష్టత రానుంది.