సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

18-11-2021 Thu 07:59
  • హిందీలో డబ్బింగ్ చెబుతున్న ప్రభాస్ 
  • అమెరికా నేపథ్యంలో బాలకృష్ణ సినిమా
  • 'వేదాంతం రాఘవయ్య'గా సత్యదేవ్
Prabhas starts dubbing for Radhe Shyam
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధేశ్యామ్' చిత్రం హిందీ వెర్షన్ కు సంబంధించిన డబ్బింగ్ జరుగుతోంది. ప్రస్తుతం హీరో ప్రభాస్ హిందీ వెర్షన్ కి డబ్బింగ్ చెబుతున్నట్టు సమాచారం. ఇందులో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
*  బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి జరుగుతుంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం అమెరికా నేపథ్యంలో తెరకెక్కుతోందట.  
*  హరీశ్ శంకర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన చంద్రమోహన్ దర్శకత్వంలో సునీల్ హీరోగా 'వేదాంతం రాఘవయ్య' పేరిట ఓ చిత్రం రూపొందనున్నట్టు ఆ మధ్య ప్రకటన వచ్చింది. అయితే, తాజాగా ఈ చిత్రంలో సునీల్ బదులు సత్యదేవ్ హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.