KTR: రోడ్డు ప్రమాద బాధితులను తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించిన కేటీఆర్

KTR rushed the road accident victims to the hospital in his convoy
  • హకీంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు
  • సాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో అటుగా వచ్చిన కాన్వాయ్
  • కారు దిగి తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించిన మంత్రి
రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తమోడుతున్న విద్యార్థులను మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించారు. మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు హకీంపేట వద్ద గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

అదే సమయంలో కాన్వాయ్‌గా అటునుంచి వస్తున్న మంత్రి కేటీఆర్ గాయపడి రక్తమోడుతున్న యువకులను చూశారు. వెంటనే కారు ఆపి కిందికి దిగారు. ప్రమాదం గురించి తెలుసుకుని, రక్తమోడుతున్న విద్యార్థులను తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
KTR
Hyderabad
Telangana
Road Accident

More Telugu News