వచ్చే దసరా దిశగా 'భవదీయుడు భగత్ సింగ్'

17-11-2021 Wed 18:39
  • జనవరి 12న రానున్న 'భీమ్లా నాయక్'
  • ఏప్రిల్ 29వ తేదీన రానున్న 'వీరమల్లు'
  • తరువాత సినిమా దర్శకుడిగా హరీశ్ శంకర్
  • అక్టోబర్ 5వ తేదీన విడుదల చేసే ఛాన్స్
Bhavadeeyudu Bhagath Singh movie update
పవన్ కల్యాణ్ కొంతకాలంగా 'భీమ్లా నాయక్' సినిమా చేస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ  తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత సినిమాగా ఆయన క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేయనున్నాడు.

చారిత్రక నేపథ్యంలో సాగే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక ఆ తరువాత ప్రాజెక్టుగా హరీశ్ శంకర్ సినిమా ఉంటుంది. ఈ సినిమాకి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ దిశగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారనే మరో టాక్ కూడా వినిపిస్తోంది. గతంలో పవన్ - హరీశ్ కాంబినేషన్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.