నాగ్ చేతుల మీదుగా 'అనుభవించు రాజా' ట్రైలర్!

16-11-2021 Tue 17:58
  • రాజ్ తరుణ్ నుంచి 'అనుభవించు రాజా'
  • కొత్త కథానాయిక పరిచయం 
  • దర్శకుడిగా శ్రీనివాస్ గవిరెడ్డి 
  • ఈ నెల 26వ తేదీన విడుదల
Bangaraju will be releasing the trailer of Anubhavinchu Raja
రాజ్ తరుణ్ హీరోగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో 'అనుభవించు రాజా' సినిమా రూపొందింది. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైంది. ఈ సినిమాతో కొత్త కథానాయిక పరిచయమవుతోంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ఒక ముహూర్తాన్ని సెట్ చేశారు. రేపు ఉదయం 10:08 నిమిషాలకు ఈ ట్రైలర్ ను నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు. మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.

ఈ కథ ఇటు పల్లెలోను .. అటు పట్నంలోను నడుస్తుంది. హీరోను జల్సారాయుడిగాను .. ఓ చిన్నపాటి జాబ్ చేసుకుంటున్నవాడిగాను చూపించారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కొంతకాలంగా రాజ్ తరుణ్ కి హిట్ పడలేదు. దాంతో ఆయన ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి..