Sharmila: ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఇంటికో తాగుబోతుని తయారుచేస్తున్నందుకు సిగ్గుపడు కేసీఆర్: షర్మిల

  • సీఎం కేసీఆర్ పై షర్మిల విమర్శనాస్త్రాలు
  • మద్యం ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారని వ్యాఖ్య 
  • తాగుబోతోళ్ల కష్టం మీకే బాగా తెలిసినట్టుంది అంటూ ఎద్దేవా
  • బారుల తెలంగాణగా మార్చారన్న షర్మిల 
YS Sharmila comments on KCR

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్ పై విమర్శల్లో దూకుడు పెంచారు. రైతుల కడుపుకొట్టి, బడులను బంద్ పెట్టి, బార్లకు రండి బాబూ రండి అంటూ డోర్లు తెరుస్తున్నావ్ అని మండిపడ్డారు.

"సిగ్గుపడు కేసీఆర్... సిగ్గుపడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇంటికో తాగుబోతుని తయారుచేస్తున్నావ్. ఆదాయం పెంచుకునే  తెలివి లేక మద్యం మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నందుకు సిగ్గుపడు. తాగుబోతోళ్ల కష్టం మీకే బాగా తెలిసినట్టుంది. అందుకే దొరగారు గల్లీకి ఒక వైన్ షాపు, వీధికో బారు, గ్రామానికి 10 బెల్టు షాపులు ఏర్పాటు చేసి బంగారు తెలంగాణను బారుల తెలంగాణగా, బీరుల తెలంగాణగా మార్చారు. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి లిక్కర్ షాపులను పెంచడంలో, డ్రగ్స్ అమ్మడంలో మాత్రమే కనిపిస్తోంది" అని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

More Telugu News