Actress Chaurasia: హీరోయిన్ చౌరాసియా పెదవులు, మెడపై దాడి చేశాడు: బంజారాహిల్స్ పోలీసులు

Actress Chaurasia attacked
  • ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో చౌరాసియాపై దాడి
  • పొదల్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేసిన దుండగుడు
  • కాలి మడమకు ఫ్రాక్చర్
హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ వద్ద సినీ నటి చౌరాసియాపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో ఆమె వాకింగ్ పూర్తి చేసుకున్న తర్వాత... జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 92లోని స్టార్ బక్స్ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతం వద్ద దుండగుడు ఆమెపై దాడి చేశాడు. ఆమె కేకలు వేయకుండా నోటికి గుడ్డలు అడ్డుపెట్టి, పక్కనే ఉన్న బండరాయికి అదిమి పెట్టాడు.

చౌరాసియాపై దాడి చేసింది ఒక సైకో అని పోలీసులు భావిస్తున్నారు. ఈ అంశంపై బంజారాహిల్స్ పోలీసులు మాట్లాడుతూ, ఆమె పెదవులు, మెడపై దుండగుడు దాడి చేశాడని చెప్పారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, పొదల్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడని తెలిపారు.

ఈ క్రమంలో ఆమె కాలి మడమకు కూడా ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. ఆమె మొబైల్ ఫోన్ ను దుండగుడు లాక్కెళ్లాడని తెలిపారు. ఈ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తును చేపట్టిన పోలీసులు పార్కు చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దుండగుడి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
Actress Chaurasia
Tollywood
Attack

More Telugu News