TRSLP: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు టీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ

  • తెలంగాణలో ధాన్యం కొనుగోలు రగడ
  • టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
  • రేపు సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
  • హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
TRSLP will meet on tomorrow

ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం ద్వంద్వ వైఖరిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రజలను బీజేపీ గందరగోళంలోకి నెడుతోందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ అధినాయకత్వం ఈ అంశాన్ని కూడా రేపటి భేటీలో చర్చించనుంది.

ఈ కీలక సమావేశానికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీలో ధర్నా చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఈ అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తమ్మీద ధాన్యం అంశంలో కేంద్రాన్ని, బీజేపీని ఎదుర్కొనేందుకు భవిష్యత్ కార్యాచరణను రేపటి సమావేశంలో ఖరారు చేయనున్నారు.

More Telugu News