Salman Khurshid: హిందుత్వపై వ్యాఖ్యలు... కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు

  • అయోధ్యపై సల్మాన్ ఖుర్షీద్ పుస్తకం
  • మండిపడుతున్న కాషాయవాదులు
  • నైనిటాల్ లో ఖుర్షీద్ నివాసం ధ్వంసం
  • తన వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న ఖుర్షీద్
Culprits set fire to Congress leader Salman Khurshid house

అయోధ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలు కాషాయవాదులను తీవ్ర ఆగ్రహానికి గురిచేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నైనిటాల్ లోని సల్మాన్ ఖుర్షీద్ నివాసం వద్ద దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఇంటికి నిప్పు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సల్మాన్ ఖుర్షీద్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. తగలబడిన తలుపులు, ధ్వంసమైన కిటికీలను ఆ ఫొటోలు, వీడియోల్లో చూడొచ్చు.

సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ, ఇది హిందూయిజం కానే కాదు అనడానికి ఈ విధ్వంసమే ఉదాహరణ అని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని ఈ దాడి ఘటనే చెబుతోందని వివరించారు.

సల్మాన్ ఖుర్షీద్ 'సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్ హుడ్ ఇన్ అవర్ టైమ్స్' అనే పుస్తకం రాశారు. అందులో... సనాతన ధర్మం, అసలైన హిందూయిజం ఎప్పుడో మరుగునపడిపోయాయని, రాజకీయం హిందూయిజం రాజ్యమేలుతోందని పేర్కొన్నారు. ఐసిస్, బోకో హరామ్ వంటి ఉగ్రవాద సంస్థల ఇస్లామిక్ జిహాద్ కు ఇదేమీ తీసిపోదని వివరించారు.

ఈ వ్యాఖ్యలతో బీజేపీ నేతలు మండిపడ్డారు. సల్మాన్ ఖుర్షీద్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన నివాసంపై దాడి ఈ క్రమంలోనే జరిగినట్టు తెలుస్తోంది.

More Telugu News