'ఖతీజా' పాత్రలో సమంత లుక్ ఇదే!

15-11-2021 Mon 18:28
  • విజయ్ సేతుపతి హీరోగా తాజా చిత్రం
  • వైవిధ్యభరితమైన పాత్రలో సమంత
  • కీలకమైన పాత్రలో నయనతార
  • డిసెంబర్లో థియేటర్స్ లో విడుదల    
Samantha First Look Released
సమంత ఇక పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. సెట్స్ పై ఉన్న సినిమాలను పూర్తిచేయడం .. కొత్త సినిమాలకి సైన్ చేయడం వంటి పనులతో బిజీగా ఉంది. తమిళంలో విజయ్ సేతుపతి జోడీగా ఆమె చేసిన 'కాతువాకుల రెండు కాదల్' సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ సినిమాలో రాంబో పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. తాజాగా 'ఖతీజా'గా సమంత పాత్రను పరిచయం చేస్తూ ఆమె పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో ఆమె చాలా మోడ్రన్ గా కనిపించనుందనే విషయం అర్థమవుతోంది. మరో ప్రధానమైన పాత్రలో నయనతార అలరించనుంది. త్వరలో ఆమె పాత్రకు సంబంధించిన లుక్ ను వదలనున్నారు.

విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకి దర్శకుడు మాత్రమే కాదు .. నిర్మాణ భాగస్వామి కూడా. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. డిసెంబర్లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ స్పష్టం చేశారు.