వైయస్ వివేకానందరెడ్డి హత్య వెనకున్నది ఆయన రక్తసంబంధీకులే: పంచుమర్తి అనురాధ
- వివేకా హత్య కేసులో వాస్తవాలు నిర్ధారణ అయ్యాయి
- అయినా వైసీపీ నేతలు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
- వైసీపీ నేతల చర్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
వివేకా హత్యపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గతంలో విజయసాయిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు ఇబ్బంది పడ్డారని అనురాధ అన్నారు. ఈ హత్య కేసు గురించి వైసీపీ బులుగు మీడియా, ఆ పార్టీ నేతలు మొదటి నుంచి తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతల చర్యలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
ఈ కేసుపై ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.