Mahesh Babu: మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై కొత్త రూమర్!

Samantha acting in Mahesh Babu and Rajamouli film
  • 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్లతో బిజీగా రాజమౌళి
  • మహేశ్ బాబుతో రాజమౌళి తదుపరి చిత్రం
  • ఈ సినిమాలో సమంత నటించబోతోందని ప్రచారం
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కించిన మల్టీ స్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్లతో దర్శకుడు రాజమౌళి బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 7న సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయబోతున్నారు.

ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ తో ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన, వివరాలన్నీ వచ్చే ఏడాది వెలువడనున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి సమాచారం వెలువడకపోయినా... దీనిపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు ఈ సినిమా గురించి ఒక రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన సమంత నటించబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతమాత్రం నిజమనే విషయం తెలియాల్సి ఉంది.
Mahesh Babu
Rajamouli
Samantha
RRR
Tollywood

More Telugu News