Telugudesam: కుప్పం పరిసరాల్లో మంత్రులంతా మోహరించారు: టీడీపీ ఫిర్యాదు

  • నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ 
  • వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఈసీకి టీడీపీ ఫిర్యాదు
  • వైసీపీ బెదిరింపులకు భయపడబోమని వ్యాఖ్య
All ministers are at Kuppam says TDP

ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పెనుకొండ జీఐసీ కాలనీలో మంత్రి శంకర్ నారాయణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరు 16వ డివిజన్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటు వేశారు.

 మరోవైపు వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీని కలిసిన వారిలో బొండా ఉమ, బోడె ప్రసాద్, అశోక్ బాబు తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫొటోలు, వీడియోలతో పాటు అన్ని ఆధారాలను ఈసీకి సమర్పించామని చెప్పారు. కుప్పం పరిసరాల్లో మంత్రులంతా మోహరించారని, అయితే వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతూనే ఉంటామని అన్నారు.

More Telugu News