చరణ్ వాయిస్ ఓవర్ తో విడుదలైన 'గని' టీజర్!

15-11-2021 Mon 11:58
  • వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'గని'
  • బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా సయీ మంజ్రేకర్ 
  • డిసెంబర్ 24వ తేదీన విడుదల
Ghani movie teaser released
వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' సినిమా రూపొందింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు.

ఈ టీజర్ కి చరణ్ తో వాయిస్ ఓవర్ చెప్పించారు. ఆయన వాయిస్ ఓవర్ పై వరుణ్ తేజ్ బాక్సింగ్ విజువల్స్ ను కట్ చేశారు. చరణ్ వాయిస్ ఓవర్ వలన టీజర్ చాలా కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. "ప్రతి ఒక్కరి కథలో కష్టాలు .. కన్నీళ్లు ఉంటాయి. కోరికలుంటాయి .. కోపాలుంటాయి. కలబడితే గొడవలుంటాయి.

"అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అయిపోవాలనే ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే. ఆ ఒక్కడివి నువ్వే ఎందుకవ్వాలి? ఆట ఆడినా .. ఓడినా కూడా రికార్డ్స్ లో ఉంటావు .. కానీ గెలిస్తే మాత్రం చరిత్రలో ఉంటావు" అంటూ చరణ్ వాయిస్ ఓవర్ కొనసాగింది. డిసెంబర్ 24వ  తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.