Kane Williamson: టీ20 వరల్డ్ కప్ ఫైనల్: విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్... న్యూజిలాండ్ 172/4

  • దుబాయ్ లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
  • మొదట బ్యాటింగ్ చేసిన కివీస్
  • 48 బంతుల్లో 85 పరుగులు చేసిన విలియమ్సన్
  • 10 ఫోర్లు, 3 సిక్సులు బాదిన కివీస్ సారథి
Kane Williamson blasts as New Zealand posted huge total

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 48 బంతుల్లోనే 85 పరుగులు చేయడం విశేషం. విలియమ్సన్ 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఆసీస్ ప్రధాన బౌలర్ మిచెల్ స్టార్క్ విసిరిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో విలియమ్సన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ ఓవర్లో 4 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు.

ఇక ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 28, గ్లెన్ ఫిలిప్స్ 18, జేమ్స్ నీషామ్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 3, జంపా 1 వికెట్ తీశారు. స్టార్క్ దారుణంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకున్నాడు.

More Telugu News