Australia: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు సర్వం సిద్ధం... న్యూజిలాండ్ పై టాస్ గెలిచిన ఆసీస్

  • దుబాయ్ వేదికపై టైటిల్ సమరం
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
  • జట్టులో ఎలాంటి మార్పులు లేవన్న ఫించ్
  • కివీస్ జట్టులో ఒక మార్పు
  • కాన్వే స్థానంలో సీఫెర్ట్ కు చోటు
Australia won the toss in world cup final

నెలరోజుల పాటు వినోదం అందించిన టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. నేడు ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ టైటిల్ పోరుకు వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో కీలకమైన టాస్ ఆస్ట్రేలియాను వరించింది. టాస్ నెగ్గిన ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సెమీస్ లోనూ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆసీస్ అద్భుతమైన రీతిలో ఛేజింగ్ చేయడం తెలిసిందే.

కాగా, ఫైనల్ మ్యాచ్ కు ఆసీస్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఫించ్ తెలిపాడు. పాక్ తో సెమీస్ ఆడిన జట్టునే బరిలో దింపుతున్నామని పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్ జట్టులో వికెట్ కీపర్ డెవాన్ కాన్వే స్థానంలో సీఫెర్ట్ జట్టులోకి వచ్చాడు. కాన్వే మొన్నటి మ్యాచ్ లో అసహనంతో తన బ్యాట్ తో తానే కొట్టుకుని గాయపడ్డాడు. అతడు ఈ మ్యాచ్ కు అన్ ఫిట్ అని తేలడంతో సీఫెర్ట్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. దాంతో తొలిసారి టీ20 వరల్డ్ టైటిల్ ను ముద్దాడాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.

More Telugu News