Cricket: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేపథ్యంలో కేన్ విలియమ్సన్ కూల్ ఆన్సర్.. ఏం చెప్పాడంటే..

  • ఇదీ అన్ని మ్యాచ్ ల లాంటిదేనని కామెంట్
  • హైప్ ను సింపుల్ గా కొట్టిపారేసిన న్యూజిలాండ్ కెప్టెన్
  • కేవలం ఆట మీదే దృష్టి పెడతామని వెల్లడి
  • ప్రణాళికలు అమలు చేస్తామన్న కేన్
Kane Williamson Response On World Cup Final Match

న్యూజిలాండ్ కెప్టెన్ విలయమ్సన్ కు కెప్టెన్ కూల్ గా పేరు. ఎలాంటి నిర్ణయాన్నైనా అతడు కూల్ గా ఆలోచించే తీసుకుంటాడు. ఇవాళ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలోనూ అతడు అంతే కూల్ గా ఉన్నాడు. భారీ అంచనాలను కొట్టిపారేశాడు. ఇది తమకు అన్ని మ్యాచ్ లలాగానే ఒక మ్యాచ్ మాత్రమేనని స్పష్టం చేశాడు.

రెండు సార్లు వరుసగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ కు, తాజాగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు న్యూజిలాండ్ వచ్చింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో రెండుసార్లూ ఆ జట్టు ఓడింది. 2015లో ఆసీస్ చేతిలో ఓడిపోయిన విలియమ్సన్ టీం.. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లోనూ అదే ఆసీస్ తో తలపడుతోంది. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ ఏం చేస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే మ్యాచ్ పై స్పందించిన విలియమ్సన్.. చాలా కూల్ గా జవాబిచ్చేశాడు. ఫైనల్ దాకా వచ్చామంటే అది తమ కష్టఫలితమేనన్నాడు. చిన్నచిన్న తప్పులను సరిచేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పాడు. మ్యాచ్ కు అవసరమైన ఫోకస్ పెడ్తామన్నాడు. జట్టుగా తామంతా మెరుగ్గా ఆడుతున్నామన్నాడు. మరింత ఎదిగేందుకు కృషి చేస్తున్నామని, ఆ ప్రాసెస్ లో చాలా విషయాలను నేర్చుకుంటున్నామని తెలిపాడు.

ఫైనల్ మ్యాచ్ అని కంగారు పడాల్సిన అవసరం లేదని, మ్యాచ్ లో తమకు సాధ్యమైనంత మేర మెరుగ్గా ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తామని చెప్పాడు. మైదానంలో తాము అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేయడంపైనే తమ దృష్టి అని అన్నాడు. వికెట్ కీపర్ డేవన్ కాన్వే గాయం కారణంగా మ్యాచ్ ఆడటంలేదని, అది జట్టుకు ఒక రకంగా దెబ్బేనని అతడు పేర్కొన్నాడు.

More Telugu News