Karthikeya: ఇష్టంతో కష్టపడి చేసిన సినిమా ఇది: కార్తికేయ

Karthikeya cimments in Raja Vikramarka Movie
  • నిన్న విడుదలైన 'రాజా విక్రమార్క'
  • కార్తికేయ జోడీగా తాన్య రవిచంద్రన్ 
  • సక్సెస్ మీట్ నిర్వహించిన మేకర్స్ 
  • సంతోషంగా ఉందన్న కార్తికేయ
కార్తికేయ కథానాయకుడిగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో 'రాజా విక్రమార్క' సినిమా తెరకెక్కింది. యాక్షన్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాన్య రవిచంద్రన్ కథానాయికగా నటించిన ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ముఖ్య పాత్రధారులు .. సాంకేతిక నిపుణులు ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు.  

కార్తికేయ మాట్లాడుతూ .. "నేను చేసిన సినిమాల్లో 'ఆర్ ఎక్స్ 100' తరువాత అంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే. బయట నుంచి చాలా కాల్స్ .. మెసేజ్ లు వస్తున్నాయి. ఎంతో ఇష్టపడి చేసినందుకు .. మనసుపెట్టి చేసినందుకు తగిన ఫలితం దక్కిందని అనిపిస్తోంది. థియేటర్లో చూడగలిగిన సినిమాను తీయగలిగామనే సంతోషం కలిగింది.

ఈ సినిమాకి అన్ని వైపుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ తో నిర్మాతలు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. యాక్షన్ తో పాటు కామెడీని అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా హర్షవర్ధన్ కామెడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక మంచి సినిమాకి జనం నుంచి తప్పకుండా మంచి ఆదరణ ఉంటుందని మరోసారి నిరూపించారు" అని చెప్పుకొచ్చాడు.
Karthikeya
Tanya Ravichandran
Rajavikramarka Movie
Success meet

More Telugu News