Ashok Galla: మహేశ్ మేనల్లుడి 'హీరో' రిలీజ్ డేట్ ఖరారు!

Hero movie release date cinfirmed
  • అశోక్ గల్లా నుంచి 'హీరో'
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు 
  • జనవరి 26వ తేదీన విడుదల
మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 'హీరో' అనే సినిమా చేశాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అశోక్ జోడీగా నిధి అగర్వాల్ నటించింది. గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమా యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీ. తాజాగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

జనవరి 26వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. జనవరిలో ప్లాన్ చేసుకున్న కొన్ని పెద్ద సినిమాలు ఫిబ్రవరికి .. ఏప్రిల్ కి వెళ్లి పోయాయి. అలాంటిది 'హీరో' చాలా ధైర్యంగా ఈ డేట్ ను ఖరారు చేసుకున్నాడు.

ఇందుకు సంబంధించిన పోస్టర్ చూస్తుంటే, యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉండనున్నట్టు తెలుస్తోంది. జిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో నరేశ్ .. వెన్నెల కిషోర్ .. బ్రహ్మాజీ కనిపించనున్నారు.
Ashok Galla
Nidhi Agarwal
Sriram Adithya
Hero Movie

More Telugu News