Andhra Pradesh: ఏపీలో గణనీయంగా తగ్గుతున్న కరోనా కేసులు.. గడచిన 24 గంటల్లో ఒకటే మరణం!

156 Corona Cases recorded in Andhrapradesh
  • నిన్నటితో పోలిస్తే గణనీయంగా తగ్గిన కేసులు
  • కృష్ణా జిల్లాలో ఒకే ఒక్క మరణం నమోదు
  • కోలుకున్న 254 మంది డిశ్చార్జ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 262 మంది కరోనా బారినపడగా, నేడు ఆ సంఖ్య 156కు పడిపోయింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,987 నమూనాలను పరీక్షించగా వీరికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, గత 24 గంటల్లో 254 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 34 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కడప జిల్లాలో ఒకే ఒక్క కేసు వెలుగు చూసింది. కరోనా కారణంగా నేడు కృష్ణా జిల్లాలో ఒకే ఒక్క మరణం సంభవించింది.

ఇప్పటి వరకు మొత్తంగా  20,69,770 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,52,230 మంది డిశ్చార్జ్ అయ్యారు. 14,412 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం 3,128 మంది చికిత్స పొందుతున్నట్టు ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్‌లో తెలిపింది.

  • Loading...

More Telugu News