Odisha: వేరే గ్రూపు రక్తం ఎక్కించిన ఆసుపత్రి సిబ్బంది.. మహిళ మృతి

  • ఒడిశాలో దారుణ ఘటన
  • మహిళకు సికిల్ సెల్ అనీమియా
  • రూర్కెలా ప్రభుత్వాసుపత్రిలో రక్తమార్పిడి
  • ఓ పాజిటివ్ కు బదులు బీ పాజిటివ్ ఎక్కించారని ఆరోపణ
Odisha Woman Dies Due to Alleged Transfusion Of Wrong Blood Group

ఒక గ్రూపునకు బదులు వేరే గ్రూపు రక్తం ఎక్కించడంతో ఓ 25 ఏళ్ల మహిళ అసువులు బాసింది. ఈ ఘోర విషాద ఘటన ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో జరిగింది. కుత్రా బ్లాక్ లోని బుదకటకు చెందిన సరోజిని కాకు అనే మహిళ సికిల్ సెల్ అనీమియా (ఒక రకమైన రక్తహీనత.. రక్తాన్ని మారుస్తూ ఉండాలి)తో బాధపడుతోంది. ఈ క్రమంలోనే రక్త మార్పిడి కోసం రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రి (ఆర్జీహెచ్)కి గురువారం మధ్యాహ్నం వెళ్లింది. అయితే, రక్తం ఎక్కించిన కాసేపటికే ఆమె మృత్యువాత పడింది.

దానికి కారణం ఆసుపత్రి సిబ్బంది వేరే గ్రూపు రక్తం ఎక్కించారని ఆమె బంధువులు ఆరోపించారు. సరోజిని బ్లడ్ గ్రూపు 'ఓ' పాజిటివ్ అని, కానీ, బీ పాజిటివ్ రక్తం ఎక్కించారని ఆరోపించారు. అందుకే ఆమె చనిపోయిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్జీహెచ్ ఉన్నతాధికారులు కూడా విచారణ కమిటీని నియమించారు. అయితే, తమ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ జదీశ్ చంద్ర బెహెరా చెప్పారు. అన్ని టెస్టులు చేశాకే రక్తం ఎక్కిస్తామని, తప్పుడు రక్తం ఎక్కిస్తే కేవలం పావుగంటలోనే చనిపోతారని తెలిపారు.

More Telugu News