Union Minister: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో మార్పులు

Amit Shah Tirupati Tour Schedule Has the Minor Changes
  • రాత్రి 8.45కు శ్రీవారి దర్శనం
  • ఆయన వెంట సీఎం జగన్
  • రేపు ఉదయం నెల్లూరు స్వర్ణభారత్ ట్రస్ట్ కు పయనం
  • మధ్యాహ్నం జోనల్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఇవాళ సాయంత్రం 7.40 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని పలు కార్యక్రమాలలో పాల్గొంటారని, ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారని తొలుత షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే, ఇప్పుడు అందులో స్వల్ప మార్పులను చేశారు. రాత్రి 8.30 గంటలకు ఆయన తిరుమల చేరుకుంటారు. రాత్రి 8.45 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. ఆయన వెంట ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటారు. దర్శనం తర్వాత తిరుపతిలోని తాజ్ హోటల్ లో అమిత్ షా బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం నెల్లూరులోని స్వర్ణభారత్ ట్రస్టుకు వెళతారు. మధ్యాహ్నం దక్షిణాది జోనల్ కౌన్సిల్ భేటీలోనూ ఆయన పాల్గొననున్నారు.
Union Minister
Amit Shah
Home Minister
BJP
YS Jagan
Tirumala
Tirupati
Andhra Pradesh

More Telugu News