Balakrishna: బాలయ్య 107వ చిత్రం షూటింగ్ అట్టహాసంగా ప్రారంభం.. ఫొటోలు ఇవిగో!

NBK107 kicks off on an auspicious note with Pooja Event
  • బాలకృష్ణ, శ్రుతిహాసన్, మలినేని గోపీచంద్ కాంబినేషన్లో చిత్రం
  • క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన వీవీ వినాయక్
  • వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
అన్ స్టాపబుల్ అంటూ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో బాలయ్య నటించే 107వ చిత్రం కాసేపటి క్రితం ప్రారంభమయింది. సినిమా పూజ కార్యక్రమానికి హీరోయిన్ శ్రుతిహాసన్, బోయపాటి శ్రీను, వీవీ వినాయక్, కొరటాల శివ, హరీష్ శంకర్, బాబీ, బుచ్చిబాబు తదితలు హాజరయ్యారు.

బాలయ్య, శ్రుతిహాసన్ లపై వీవీ వినాయక్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి షాట్ కు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. బాబి, కొరటాల శివ, బుచ్చిబాబులు ఈ చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్ కు స్క్రిప్ట్ అందజేశారు.

ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం. ఓ పాత్రలో ఫ్యాక్షనిస్టుగా, మరో పాత్రలో స్వామీజీగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Balakrishna
107
Movie
Shooting
Shruti Haasan
Malineni Gopichand
Tollywood

More Telugu News