Bellamkonda Ganesh: భాగ్యశ్రీ కూతురుతో బెల్లంకొండ గణేశ్ రొమాన్స్!

Avanthika in Bellamkonda Ganesh movie
  • బాలీవుడ్ కి బెల్లంకొండ శ్రీనివాస్
  • టాలీవుడ్ కి బెల్లంకొండ గణేశ్
  • దర్శకుడిగా సతీశ్ వేగేశ్న
  • త్వరలోనే సెట్స్ పైకి    
బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ హీరోగా తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. వచ్చే ఏడాదిలో బాలీవుడ్ కి పరిచయం కావడం కోసం, హిందీలో 'ఛత్రపతి' రీమేక్ లో చేస్తున్నాడు. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఇదే సమయంలో శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.

ఆయన హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం 'అవంతిక దాసాని'ని సంప్రదిస్తున్నారట. 'మైనే ప్యార్ కియా' హీరోయిన్ భాగ్యశ్రీ కూతురే అవంతిక దాసాని. అప్పట్లో భాగ్యశ్రీ మాదిరిగా ఇప్పుడు ఈ అమ్మాయి చాలా గ్లామరస్ గా ఉంటుంది.  

బెల్లంకొండ సినిమా కోసం ఆమె టెస్ట్ షూట్ కూడా జరిగిందని అంటున్నారు. దాదాపు ఆమె ఎంపిక జరిగిపోయినట్టేనని చెబుతున్నారు. ఇది రొమాంటిక్ టచ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. మిగతా పాత్రలకి అవసరమైన నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Bellamkonda Ganesh
Avanthika Dasani
Sathish Vegeshna

More Telugu News