Andhra Pradesh: కాకినాడలో ఉద్రిక్తత.. విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట

  • కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ధర్నా
  • ఐడీఎల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్
  • వర్షంలోనూ నిరసన కొనసాగించిన స్టూడెంట్స్
Students Confronted Police In Kakinada

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విద్యార్థులు కదం తొక్కారు. ఐడీఎల్ ఎయిడెడ్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దంటూ కలెక్టరేట్ ను ముట్టడించారు. గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బారికేడ్లు, కలెక్టరేట్ గేటును తోసుకుంటూ లోపలికెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

ఓ దశలో విద్యార్థులు కలెక్టరేట్ లోపలికిరాగా.. వారందరినీ బయటకు పంపించి గేటు మూసేశారు. అయినాగానీ తగ్గని విద్యార్థులు వర్షంలోనూ నిరసనను కొనసాగించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. సత్తిబాబు హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనను విరమించారు. అంతకుముందు పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

  • Loading...

More Telugu News