'ఫ్లూటూ జింక ముందు ఊదు...' అంటూ బాల‌కృష్ణ డైలాగ్ కొట్టిన నాని.. పడిపడి నవ్విన బాలయ్య.. వీడియో ఇదిగో

12-11-2021 Fri 11:49
  • ఆహా'లో 'అన్‌స్టాప‌బుల్' పేరిట షో
  • బాల‌య్య డైలాగు చెప్పిన నాని
  • నాని డైలాగు చెప్పిన బాల‌కృష్ణ‌
  • నేటి రాత్రి 8 గంట‌ల నుంచి ప్ర‌సారం
unstoppable 2nd episode from today
'ఫ్లూటూ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..' అంటూ నంద‌మూరి బాల‌కృష్ణ ముందు నేచుర‌ల్ స్టార్ నాని డైలాగ్ కొట్టాడు. ఆ డైలాగు బాల‌య్య సినిమాలోని డైలాగ‌న్న విష‌యం తెలిసిందే. దీంతో 'అంద‌రికీ పెట్టింది (ప్ర‌సాదం) నాకు పెట్టలేదంటే నేనెంత స్పెష‌ల్' అంటూ హీరో నాని 'ఈగ' సినిమాలోని డైలాగును బాల‌కృష్ణ చెప్పారు.

ఆహా'లో 'అన్‌స్టాప‌బుల్' పేరిట ప్రారంభ‌మైన షోకు బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. రెండో ఎపిసోడ్‌లో హీరో నాని వస్తున్న విష‌యంపై అధికారింగా ఇప్పుటికే ఆహా నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇప్పుడు నానికి సంబంధించిన మ‌రో ప్రోమోను ఆహా విడుద‌ల చేసింది.  
                                 
బాల‌కృష్ణ‌తో నాని చిరున‌వ్వులు చిందిస్తూ మాట్లాడిన తీరు అల‌రిస్తోంది. ఈ రోజు రాత్రి 8 గంట‌ల నుంచి ఈ షో ప్ర‌సార‌మ‌వుతుంద‌ని ఆహా తెలిపింది. కాగా, ఈ నెల 4న ఆహా'లో 'అన్‌స్టాప‌బుల్'  తొలి ఎపిసోడ్ ప్ర‌సార‌మైంది. తొలి గెస్ట్ గా మోహ‌న్ బాబు త‌న కుమార్తె మంచు ల‌క్ష్మి, కుమారుడు మంచు విష్ణుతో కలసి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.