Reshma Kosaraju: అమెరికా చిల్డ్రెన్స్ క్లైమేట్ ప్రైజ్ దక్కించుకున్న తెలుగమ్మాయి రేష్మ కొసరాజు

  • అనేక దేశాల్లో కార్చిచ్చులు
  • ప్రకృతికి తీవ్ర నష్టం
  • ఏటా లక్షల మంది ప్రాణాలు పోతున్న వైనం
  • ఏఐ సాంకేతికతతో నూతన విధానం రూపొందించిన రేష్మ
  • కార్చిచ్చులను ముందే పసిగట్టే టెక్నాలజీ
Reshma Kosaraju win Childrens Climate Prize

భారత సంతతి అమ్మాయి రేష్మ కొసరాజు అమెరికాలో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకుంది. తెలుగుమ్మాయి రేష్మను చిల్డ్రెన్స్ క్లైమేట్ ప్రైజ్-2021 వరించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం శ్రమించే బాలలకు  చిల్డ్రెన్స్   క్లైమేట్ ఫౌండేషన్ ప్రతి ఏడాది అవార్డులు అందిస్తుంది. రేష్మ కుటుంబం కాలిఫోర్నియా రాష్ట్రంలోని సరటోగా నగరంలో స్థిరపడింది. 15 ఏళ్ల రేష్మ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ద్వారా అడవుల్లో కార్చిచ్చులను ముందే పసిగట్టే విధానానికి రూపకల్పన చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులు అనేక దేశాలను వేధిస్తున్నాయి. లక్షల సంఖ్యలో జంతువులు ప్రాణాలు కోల్పోతుండడమే కాకుండా, తీవ్రస్థాయిలో పర్యావరణం దెబ్బతింటోంది. అడవులు తగలబడడంతో ఏర్పడే కాలుష్యంతో ప్రతి ఏటా 3 లక్షల మందికి పైగా మృత్యువాతపడుతున్నట్టు గుర్తించారు. కాగా, రేష్మ రూపొందించిన ఏఐ విధానంతో 90 శాతం కచ్చితత్వంతో కార్చిచ్చులను ముందే గుర్తించే అవకాశం ఉంది.

తనను చిల్డ్రెన్స్ క్లైమేట్ ప్రైజ్ కు ఎంపిక చేసినందుకు రేష్మ క్లైమేట్ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ పురస్కారంతో తన ప్రాజెక్టు అంతర్జాతీయస్థాయికి చేరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.

More Telugu News