సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

12-11-2021 Fri 07:40
  • కామెడీ చేయాలనుందంటున్న సాయిపల్లవి 
  • భారీ రేటుకి మహేశ్ సినిమా ఓవర్సీస్ హక్కులు
  • నిఖిల్ '18 పేజెస్' విడుదల తేదీ ఖరారు  
Sai Pallavi wants to do hilarious movie
*  నటిగా, డ్యాన్సర్ గా సాయిపల్లవి ప్రతిభ మనకు తెలుసు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో చేసి మెప్పించగల నటి తను. తాజాగా 'లవ్ స్టోరీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మకు పూర్తి కామెడీ సినిమా చేయాలనుందట. ఈ విషయం గురించి తాజాగా ఆమె చెబుతూ, 'అవును, మంచి కామెడీ స్క్రిప్టు వస్తే కనుక చేయాలని వుంది. అలాంటి అవకాశం వస్తే కనుక ఏమాత్రం వదులుకోను' అని చెప్పింది. మరి, త్వరలో ఆమె కోరిక తీరుతుందేమో చూద్దాం.
*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారువారి పాట' చిత్రం ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఓ ప్రముఖ పంపిణీ సంస్థ ఈ హక్కులను సుమారు 15 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
*  పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న '18 పేజెస్' చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న విడుదల చేయడానికి నిర్మాతలు నిర్ణయించినట్టు తాజా సమాచారం. గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.