Sharmila: షర్మిల 'రైతు వేదన నిరాహార దీక్ష'కు పోలీసుల అనుమతి నిరాకరణ

  • రైతుల సమస్యలపై షర్మిల దీక్ష
  • ఇందిరాపార్క్ వద్ద 72 గంటల దీక్ష
  • పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ ప్రకటన
  • జిల్లాల్లోనూ దీక్ష సాధ్యం కాదని వివరణ
Police denies permission to Sharmila Rythu Deeksha

రైతుల సమస్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిర్వహించ తలపెట్టిన 'రైతు వేదన నిరాహార దీక్ష'కు పోలీసులు అనుమతి నిరాకరించారు. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద షర్మిల 72 గంటల దీక్ష చేపట్టాలని భావించారు. ఈ దీక్ష రేపటి నుంచి షురూ చేయాలని అనుకున్నారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని వైఎస్సార్ తెలంగా పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 9 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో అక్కడ కూడా దీక్ష చేయలేని పరిస్థితి ఉందని ఆ ప్రకటనలో వివరించారు.

More Telugu News