కేరళలో వింత వ్యాధి కలకలం... వరుసగా మరణిస్తున్న శునకాలు
- కోవలం పట్టణంలో 20కి పైగా కుక్కల మృతి
- వణుకు, శ్వాస సంబంధ సమస్యలతో మృత్యువాత
- కెనైన్ డిస్టెంపర్ వ్యాధి అయ్యుంటుందని భావిస్తున్న అధికారులు
- స్థానికుల్లో ఆందోళన
కాగా, ఈ వ్యాధికి గురైన శునకాలు మరణించే ముందు వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడినట్టు గుర్తించారు. ఈ లక్షణాలు కనిపించిన రెండ్రోజుల్లోనే కుక్కలు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు.
దీనిపై పశు సంవర్ధకశాఖ అధికారులు స్పందిస్తూ, గాల్లో వ్యాపించే ఓ వైరస్ కారణంగానే శునకాలు మృత్యువాత పడుతున్నట్టు అనుమానిస్తున్నారు. బహుశా ఇది కెనైన్ డిస్టెంపర్ అనే జబ్బు అయ్యుంటుందని, ఇది వైరస్ కారణంగా సోకుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ వైరస్ కుక్కల నుంచి మనుషులకు సోకినట్టు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.