SP: తాను రాళ్ల దాడిలోనే గాయపడ్డానని విద్యార్థిని జయలక్ష్మి ఎంతో నిజాయతీగా చెప్పింది: అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప

Ananthapur SP visits injured student Jayalakshmi
  • ఇటీవల అనంతపురంలో విద్యార్థుల ఆందోళన
  • విద్యార్థిని జయలక్ష్మికి గాయాలు 
  • పోలీసుల లాఠీచార్జినే కారణమని విపక్షాల ఆగ్రహం
  • విద్యార్థినిని పరామర్శించిన జిల్లా ఎస్పీ
అనంతపురంలో కొన్నిరోజుల కిందట విద్యార్థుల నిరసన హింసాత్మక ఘటనలకు దారితీసిన సంగతి తెలిసిందే. తమ ఎయిడెడ్ కాలేజీని రద్దు చేయవద్దంటూ సాయిబాబా కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జయలక్ష్మి అనే విద్యార్థిని తలకు గాయం కాగా, పోలీసులే కారణమంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప నేడు విద్యార్థిని జయలక్ష్మిని పరామర్శించారు.

జయలక్ష్మి నివాసానికి వెళ్లిన ఆయన ఆమెతోనూ, ఆమె కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాళ్ల దాడిలోనే గాయపడ్డానని విద్యార్థిని జయలక్ష్మి నిజాయతీగా చెప్పిందని వెల్లడించారు. సాయిబాబా కాలేజీలో విద్యార్థులపై లాఠీచార్జి జరగలేదని స్పష్టం చేశారు. ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ముసుగులో కొందరు రాళ్ల దాడికి పాల్పడినట్టు భావిస్తున్నట్టు తెలిపారు.
SP
Jayalakshmi
Student
Anantapur
Andhra Pradesh

More Telugu News