'నీలాంబరి'కి 9 మిలియన్ వ్యూస్!

11-11-2021 Thu 18:34
  • కొరటాల రూపొందించిన 'ఆచార్య'
  • మంచి మార్కులు కొట్టేసిన మణిశర్మ
  • 'నీలాంబరి' పాత్రలో పూజ హెగ్డే
  • ఫిబ్రవరి 4వ తేదీన విడుదల  
Acharya movie update
ఇప్పుడు ఎక్కడ చూసినా 'నీలాంబరి' పాటనే వినిస్తోంది. యూత్ ఎక్కువగా ఈ పాటనే హమ్ చేస్తోంది. 'ఆచార్య' సినిమాలో చరణ్ - పూజ హెగ్డే కాంబినేషన్ పై చిత్రీకరించిన పాట ఇది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి - రమ్య బెహ్రా ఆలపించారు.

ఈ నెల 5వ తేదీన యూ ట్యూబ్ లో వదిలిన ఈ పాట .. యూత్ హృదయాలను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఈ పాట చాలా వేగంగా 9 మిలియన్ వ్యూస్ మార్క్ ను టచ్ చేసింది. ఫస్టు సాంగ్ తో పాటు సెకండ్ సాంగ్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుండటం టీమ్ ను ఖుషీ చేస్తోంది.

"మంత్రాలేటోయ్ ఓ పూజారి .. కాలం పోదా చేజారి, తంత్రాలేవీ రావే నారీ .. నేనేం చేయనే నన్నారి" అంటూ అనంత్ శ్రీరామ్ చేసిన పద ప్రయోగాలు ఆకట్టుకుంటాయి. అలాగే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ .. తిరు ఫొటోగ్రఫీ కూడా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. నిరంజన్ రెడ్డి - చరణ్ నిర్మాణంలో కొరటాల రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కానుంది.