షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఆదిపురుష్'.. రూ. 400 కోట్లతో తెరకెక్కిన చిత్రం!
- ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిన 'ఆదిపురుష్'
- 3డీలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
- కేవలం 103 రోజుల్లో చిత్రీకరణ పూర్తి
భారీ తారాగణం, బడ్జెట్ తో తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓం రౌత్ సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. 103 రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఒక అద్భుతమైన ప్రయాణం గమ్యస్థానానికి చేరుకుందని చెప్పారు. తాము క్రియేట్ చేసిన మేజిక్ ను మీ అందరితో పంచుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్నారు.