పాకిస్థాన్ - ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప
- ఈ సాయంత్రం రెండో సెమీస్ లో తలపడనున్న ఆసీస్, పాక్
- ఆస్ట్రేలియాను పాకిస్థాన్ ఓడిస్తుందన్న రాబిన్ ఊతప్ప
- ఇప్పటి వరకు ఉన్న జోరును కొనసాగిస్తే పాక్ దే విజయమని వ్యాఖ్య
ఈ సందర్భంగా టీమిండియా బ్యాట్స్ మెన్ రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ... ఆస్ట్రేలియాను పాకిస్థాన్ ఓడిస్తుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుత టోర్నీలో ఈ రెండు జట్లు బాగా ఆడుతున్నాయని, అయితే, ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో పాకిస్థాన్ జయకేతనం ఎగురవేసిందని తెలిపాడు.
ఈ ప్రపంచకప్ లో పాక్ జట్టు మాత్రమే అజేయంగా కొనసాగుతోందని... అందుకే రెండో సెమీస్ లో ఫేవరెట్ గా పాక్ బరిలోకి దిగుతుందని చెప్పాడు. ఇప్పటి వరకు కొనసాగించిన జోరును కొనసాగిస్తే పాకిస్థాన్ గెలవడం ఖాయమని అన్నాడు. ఆస్ట్రేలియా కూడా మెరుగ్గా రాణిస్తోందని... ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని చెప్పాడు.