'ఖిలాడి' రిలీజ్ డేట్ ఖరారు!

11-11-2021 Thu 10:50
  • 'క్రాక్'తో భారీ హిట్ కొట్టిన రవితేజ
  • నెక్స్ట్ మూవీగా రూపొందిన 'ఖిలాడి'
  • కీలకమైన పాత్రలో అర్జున్
  • ఫిబ్రవరి 11వ తేదీన విడుదల  
Khiladirelease date confirmed
రవితేజ ఈ ఏడాది ఆరంభంలోనే 'క్రాక్' సినిమాతో సంచలన విజయాన్ని సాధించాడు. ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించి పెట్టిన సినిమా ఇది. దాంతో ఆ వెంటనే రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా చేశాడు. సాధ్యమైనంత వరకూ ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే వచ్చేలా చేయాలని రవితేజ చూశాడు .. కానీ కుదరలేదు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాతో, తెలుగు తెరకి మీనాక్షి చౌదరి పరిచయమవుతోంది. మరో కథానాయికగా డింపుల్ హయతి కనిపించనుంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ కి రికార్డు స్థాయి వ్యూస్ లభించాయి. అర్జున్ .. సచిన్ కేడ్కర్ .. ముఖేశ్ రుషి ..  రావు రమేశ్ .. అనసూయ భరద్వాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ ఏడాది జనవరిలో హిట్ కొట్టిన రవితేజ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలోను అదే రేంజ్ హిట్ కొడతాడేమో చూడాలి.