Hyper Aadi: తనపై మంచు విష్ణు వర్గం దాడి చేసిందనే వార్తలపై హైపర్ ఆది స్పందన

Hyper Aadi response on news that Manchu Vishnu batch attacked him
  • ఏవేవో ఫేక్ వార్తలు రాస్తున్నారు
  • మేమంతా హ్యాపీగా షూటింగులు చేసుకుంటున్నాం
  • మీరు కూడా సంతోషంగా ఉండండి

జబర్దస్త్ షోలో తనదైన పంచ్ లతో కామెడీని పండిస్తున్న హైపర్ ఆది... వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. మరోవైపు హైపర్ ఆదిపై మంచు విష్ణు వర్గం దాడి చేసిందనే వార్తలు గత వారం రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఎట్టకేలకు హైపర్ ఆది స్పందించాడు. హైపర్ ఆది కోసం ఎవరో వెతుకుతున్నారని, దాడి చేయడం కోసం వెతుకుతున్నారని, దాడి చేశారని ఇలా ఏవేవో ఫేక్ వార్తలు వస్తున్నాయని అంటూ మండిపడ్డాడు.

'ఈ ఫేక్ వార్తలు రాసే వారందరికీ చెపుతున్నా.. మీ దగ్గర డబ్బులు లేకపోతే నాకు చెప్పండి.. నేను సంపాదించే దాంట్లో కొంత మీక్కూడా ఇస్తా'నని చెప్పాడు. తామంతా హ్యాపీగా షూటింగులు చేసుకుంటున్నామని, అందరం సంతోషంగా ఉన్నామని, మీరు కూడా సంతోషంగా ఉండాలని అన్నాడు.

  • Loading...

More Telugu News